Learn CPR

CPR ఎలా చేయబడుతుంది?

CPR లో సాధారణంగా తెలిసిన రకాలు రెండున్నాయి

  1. ఆరోగ్యసంరక్షణ ప్రదాతలు మరియు సాంప్రదాయ CPR లో సుశిక్షితులైనవారు ఛాతీ నొక్కడాలు మరియు నోటి నుండి నోటికి శ్వాస అందించడం చేసేటప్పడు వాటి నిష్పత్తి శ్వాసకు 302 సార్లు నొక్కడం చొప్పున చేయాలి. వయోజనులైన గుండె స్తంభన బాధితులలో అయితే, వారిని కాపాడేవారు ఒక సగటు వయోజనుని ఛాతీని నిమిషానికి 100 నుండి 120 సార్లు చొప్పున మరియు కనీసం 2 అంగుళాలు (5 సెం.మీ.) లోతుకినొక్కుతూ వుండడం అనేది సహేతుకమైన చర్య. అయితే ఇది చేసేటప్పుడు ఛాతీని బాగా లోతుగా మితిమీరి (2.4 అంగుళాలు [6 సెం.మీ. కంటే ఎక్కువగా ] నొక్కకూడదు.

  2. ఒక వయోజనుడు అకస్మాత్తుగా గుండె స్తంభించి పడిపోవడం చూసిన సాధారణ ప్రజలు లేదా ప్రక్కనున్నవారు నొక్కడం మాత్రమే చేసే CPR, లేదా చేతులతో మాత్రమే చేసే CPR ను చేయాలి. చేతులతో మాత్రమే చేసే CPR అంటే నోటి నుండి నోటికి శ్వాసను అందించే ప్రక్రియ రహిత CPR అని అర్థం. ఒక యుక్తవయస్కుడు లేదా వయోజనుడు అకస్మాత్తుగా ఆస్పత్రిలో కాకుండా బయటి ప్రదేశంలో (ఇల్లు, పనిచేసేచోటు, లేదా పార్కు వంటి వాటివద్ద) పడిపోవడం చూసిన వ్యక్తులకు దీనిని ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.

CPR ఎలా చేయాలి

మీరు గనక గుండె స్తంభనను ప్రత్యక్షంగా చూసినట్లయితే, 108 కి కాలచేయడం మరియు CPR ను తక్షణం ప్రారంభించడం కీలకమైన విషయం.


  • మీరు గనక స్పృహలేని వ్యక్తిని చూసి కాపాడదలచుకుంటే, మీరు సహాయపడేముందు ఎల్లప్పుడూ అపాయం వున్నదేమో పరిశీలించండి మరియు ప్రమాదాలను గమనించండి.

  • ప్రతిస్పందన కోసం పరీక్షించండి- వ్యక్తి యొక్క భుజాలను మృదువుగా కుదపండి మరియు “మీరు బాగానే వున్నారా?” అని బిగ్గరగా అడగండి.

  • సహాయం కోసం అరవండి – దగ్గరలో ఎవరైనా వున్నట్లయితే, వాళ్లని మీ దగ్గర వుండమని కోరండి, ఎందుకంటే వాళ్ల అవసరం మీకు కలగవచ్చు. మీరు ఒక్కరే వున్నట్లయితే, ఎవరి దృష్టినైనా ఆకర్షించేందుకై బిగ్గరగా అరవండి, అంతేగాని ఆ వ్యక్తిని వదలి పోకండి.

  • గుండె స్తంభన కలిగిన వ్యక్తి ఎవరికైనా శ్వాస ఆడదు లేదా సాధారణ శ్వాస ఆడదు. వారికి స్పృహ కూడా వుండదు.

  • వారి తలను వెనక్కి వాల్చి, ఈ క్రిందివాటికోసం చూస్తూ ఆ వ్యక్తికి సాధారణ శ్వాస ఆడుతుందేమో పరీక్షించండి

  • సాధారణ ఛాతీ కదలికలు, శ్వాస ఆడుతుందేమో వినడం, మీ బుగ్గపై ఆ వ్యక్తి శ్వాస తగులుతుందేమో అనుభూతి చెందడం

  • 10 సెకండ్లకు మించకుండా చూడండి, వినడం మరియు అనుభూతిని చెందండి. యెగశ్వాసలను సాధారణ శ్వాసగా భావించి తికమక పడకండి. వారి శ్వాస సాధారణంగా వుందేమో మీకు కచ్చితంగా తెలియకపోతే, అది సాధారణ శ్వాస కాదని భావించి స్పందించండి.

  • ఆ వ్యక్తి సాధారణంగా శ్వాసిస్తున్నాడని మీరు కచ్చితంగా తెలిస్తే, అప్పుడు వారిని కోలుకునే భంగిమలో వుంచండి మరియు 108 కి కాల్ చేయండి.

  • శ్వాస సాధారణంగా లేకపోతే, వారి వాయుమార్గాన్ని తెరవండి. ఒక చేతిని ఆ వ్యక్తి నుదుటిపై పెట్టి, వారి తలను మృదువుగా వెనక్కి వంచండి, తరువాత మీ రెండోచేయి యొక్క రెండు వ్రేళ్లను వారి చుబుకం క్రింద వుంచి వారి చుబుకాన్ని పైకెత్తండి – మీరు ఇది చేసేటప్పుడు మీరు వారి వాయుమార్గాన్ని తెరవండి.

  • ఆ వ్యక్తికి గనక శ్వాస ఆడకపోయినట్లయితే లేదా సాధారణ శ్వాస ఆడకపోయినట్లయితే

  • తక్షణమే 108 కి కాల్ చేయమని ఎవరినైనా కోరండి లేదా అంబులెన్స్ కోసం కోరండ

  • ఎవరినైనా ఒక పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేటర్ (PAD) కోసం కోరండి.

  • మీకు సహాయం చేసేవారెవరూ దొరకనట్లయితే, మీరు CPR ప్రారంభించడానికి ముందు 108 కి కాల్ చేయండి.

  • ఆ వ్యక్తి ప్రక్కనే మోకాళ్లపై కూర్చోండి. ఒక అరచేతిని వారి ఛాతీ మధ్యభాగంలో పెట్టండి. రెండో చేతిని మొదటి చేయిపై భాగంలో పెట్టండి. వ్రేళ్లను ఒకదానిలో ఒకటి పెట్టి బిగించండి.

  • మోచేతులను తిన్నగా పెట్టి, మీ అరచేతిని ఉపయోగించి ఛాతీ 5 నుండి 6 సెం.మీ. క్రిందకు నొక్కబడేటట్లు ఛాతీ ఎముకను క్రిందకు స్థిరంగా మరియు మృదువుగా నొక్కండి, మరియు వదిలేయండి.

  • ఈ విధంగా నిమిషానికి 100 నుండి 120 సార్లు చొప్పున ఛాతీని నొక్కండి-అంటే, సెకండుకు దాదాపు 2 సార్లు.

  • తలను వెనక్కి వంచి చుబుకం పైకెత్తడం ద్వారా వాయుమార్గాన్ని మళ్లీ తెరవండి. ఆ వ్యక్తి ముక్కు యొక్క సున్నితమైన భాగాన్ని వ్రేళ్ల నడుమ నొక్కి మూసివుంచండి.

  • ఒక సాధారణ శ్వాస తీసుకోండి, వారి నోటిని మీ నోటితో మూసి శ్వాసను స్థిరంగా లోపలకి వదలండి

  • ఆ వ్యక్తి యొక్క ఛాతీ భాగం తప్పనిసరిగా పైకి లేచి క్రిందికి దిగాలి. ఆ వ్యక్తి తలను వెనక్కి వంచి చుబుకాన్ని పైకెత్తి వుంచి, మీ నోటిని దూరంగా జరిపి, మరొక సాధారణ శ్వాసను తీసుకోండి, మరియు రెండవ ప్రాణరక్షక శ్వాసను యివ్వండి. ఈ రెండు శ్వాసలకు ఐదు సెకండ్ల కన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు.

  • మళ్లీ 30 సార్లు ఛాతీని నొక్కండి మరియు రెండు ప్రాణరక్షక శ్వాసలను యివ్వండి.

  • మీరు ప్రాణరక్షక శ్వాసలను యివ్వకపోయినప్పటికీ, 108 కి కాల్ చేయండి మరియు చేతులతో మాత్రమే చేసే CPR ను యివ్వండి. ఏమీ చేయకుండా వుండేకంటే ఇదే మెరుగైన పని.

  • వృత్తిపరమైన నిపుణుల సహాయం వచ్చి వారు పరిస్థితిని తమ చేతులోకి తీసుకునేవరకూ, లేదా ఆ వ్యక్తిలో దగ్గడం, కళ్లు తెరవడం, మాట్లాడడం, లేదా సాధారణంగా శ్వాసించడం వంటి తిరిగి స్పృహలోకి వచ్చిన లక్షణాలు కనిపించడం మొదలయ్యేవరకూ ఈ చర్యలనే కొనసాగించండి. మీకు అలసటగ వున్నట్లయితే, మరియు సహాయం చేయడానికి దగ్గరలో మరొకరెవరైనా వున్నట్లయితే, కొనసాగించవలసినదిగా వారికి సూచించండి.