గుండె స్తంభన అనగానేమి?
గుండె స్తంభన అనగా ఒక వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతూ వున్నా, లేదా లేకపోయినా అతడి పనిచేస్తున్న గుండె ఆకస్మికంగా ఆగిపోవడం. ఇది అకస్మాత్తుగా, లేదా ఇతర లక్షణాల నేపథ్యంలో రావచ్చు. తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే గుండె స్తంభన అనేది తరచుగా ప్రాణాంతకం అవుతుంది.

గుండె పోటు మరియు గుండె స్తంభన రెండూ ఒకటేనా?
కాదు. “గుండె పోటు” అనే పదాన్ని గుండె స్తంభనను వర్ణించేందుకు తరచుగా తప్పుగా ఉపయోగిస్తుంటారు. గుండె పోటు అనేది గుండె స్తంభనకు కారణం కావచ్చుగానీ, ఈ రెండు పదాలకూ అర్థం ఒకటి కాదు.
గుండెకు రక్తప్రసరణలో అవరోధం ఏర్పడినప్పుడు గుండెపోట్లు సంభవిస్తాయి. గుండె పోటు (లేదా మయోకార్డియల్ ఇన్ ఫ్యాక్షన్) అంటే రక్తప్రసరణ లోపించినప్పుడు గుండె కండరం కణజాలం మృతి చెందడం. గుండె పోటును ఒక “ప్రసరణ” సమస్యగా అర్థంచేసుకోవచ్చు. గుండె పోటు అనేది చాలా ప్రమాదకరమైనది, కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది.
దానికి విరుద్ధంగా, గుండె స్తంభన అనేది గుండె యొక్క విద్యుత్ వ్యవస్థ వైఫల్యం వలన కలుగుతుంది. గుండె సరిగా క్రమపద్ధతిలో కొట్టుకోవడం ఆగిపోతుంది. కాబట్టి దీనికి “గుండె స్తంభన” అనే పేరు గుండె యొక్క రక్తం పంపిణీ చేసే ప్రక్రియ “స్తంభించిపోయింది”, లేదా నిలిచిపోయింది.
గుండె స్తంభన కలిగినప్పుడు, తగిన చర్యలను తక్షణం తీసుకోకపోతే మరణం వేగంగా సంభవిస్తుంది. కొద్ది నిమిషాల సమయంలోనే CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ని ప్రక్రియను చేసి, డీఫైబ్రిలేటర్ ను ఉపయోగించి గుండెకు షాక్ యిచ్చి సాధారణ హృదయ స్పందన లయను గనక పునరుద్ధరించినట్లయితే గుండె స్తంభనను నివారించవచ్చు.
గుండె పనిచేయడంలో విఫలమై, గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోయినప్పుడు గుండె స్తంభన సంభవిస్తుంది.
గుండె స్తంభన అనేది ఒక “విద్యుత్ వ్యవస్థ” సమస్య.
గుండెలోని విద్యుత్ వ్యవస్థ వైఫల్యం యొక్క ప్రేరేపణ వలన గుండె స్తంభన కలిగి క్రమరహిత హృదయస్పందనకు (ఆరిథ్మియా) కారణమవుతుంది. గుండె రక్తాన్ని పంపిణీ చేసే ప్రక్రియలో అంతరాయాలు ఏర్పడినందువలన, అది మెదడుకు, ఊపిరితిత్తులకు మరియు ఇతర అవయవాలకు రక్తాన్ని పంపిణీ చేయలేదు.
గుండె స్తంభనలు మీరు ఊహించిన దానికన్నా చాలా సర్వసాధారణం, మరియు అవి ఏ వ్యక్తికయినా, ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.
హస్పిటల్ కు బయట సంవత్సరానికి దాదాపు 383,000 గుండె స్తంభనలు సంభవిస్తాయి, మరియు మొత్తం గుండె స్తంభనలలో 88 శాతం ఇంటి వద్ద సంభవిస్తాయి.
మెదడుకు తగినంత రక్తప్రసరణ లోపించిన కారణంగా ఆకస్మికంగా స్పృహకోల్పోవడం అనేది గుండె స్తంభన యొక్క లక్షణం.
జాతీయస్థాయిలో చూస్తే భారతదేశంలోని అత్యవసర చికిత్స అవసరమైన బాధితులలో 80% కన్నా ఎక్కువమంది “గోల్డెన్ అవర్” (అంటే గుండె స్తంభన కలిగిన మొదటి గంటలో) సరియైన వైద్య సంరక్షణను పొందడంలేదు, మరియు అలాంటి అత్యవసర చికిత్స అవసరమైన బాధితులలో 62% మంది ఉత్పాదక సామర్థ్య వయస్సు, అంటే 25 నుండి 50 ఏళ్ల.
ఆకస్మిక గుండె స్తంభన లక్షణాలు తక్షణమే, తీవ్రంగా సంభవిస్తాయి మరియు వాటిలో ఇవి కూడా వుంటాయి

ఆకస్మిక గుండె స్తంభనకు దారితీసే గుండె సమస్యలు
- గుండె ధమని వ్యాధి
- గుండె పోటు
- గుండె పెరగడం
- గుండె కవాటాల జబ్బు
- పుట్టుకతో వచ్చే గుండె జబ్బు
ప్రమాద కారకాలు
- గుండెధమని వ్యాధిగల కుటుంబ చరిత్ర
- పొగత్రాగడం
- అధిక రక్తపోటు
- రక్తంలో అధిక కొలెస్ట్రాల్
- ఊబకాయం
- మధుమేహం
- కదలకుండావుండే జీవనశైలి
- మద్యాన్ని అమితంగా త్రాగడం (రోజుకు 2 “డ్రింక్స్” కన్నా ఎక్కువ)
ఏం జరుగుతుంది
కొన్ని సెకండ్లలోనే, వ్యక్తి ప్రతిస్పందించడం ఆగిపోతుంది, శ్వాస పీల్చడం ఆగిపోతుంది లేదా కేవలం యెగశ్వాస వస్తుంది. బాధితునికి చికిత్స గనక జరగకపోతే నిమిషాలలోనే అతడి మరణం సంభవిస్తుంది.