Emergency Treatment of Cardiac Arrest

గుండె స్తంభన ఏ హెచ్చరికా లేకుండానే దెబ్బతీయవచ్చు

ఎవరికైనా గుండె స్తంభన కలిగినట్లు మీరు అనుమానిస్తున్నారా? ఆ లక్షణాలు ఇలా వుంటాయి:

  • ప్రతిస్పందించే గుణం ఆకస్మికంగా లోపించడం : మీరు అతడిని లేదా ఆమెను భుజాలపై గట్టిగా తట్టినా, లేదా అతడిని లేదా ఆమెను ‘బాగానే వున్నారా’ అని బిగ్గరగా అడిగినా సరే, ఆ వ్యక్తి దేనికీ ప్రతిస్పందించడు. ఆ వ్యక్తి కదలడు, మాట్లాడడు, కనురెప్పలు ఆర్పడు లేదా ఇంకే విధంగానూ ప్రతిస్పందించడు.

  • సాధారణ శ్వాస లేదు: సాధారణ శ్వాసం ఆడడంలేదు ఆ వ్యక్తికి శ్వాస ఆడడంలేదు లేదా గాలికోసం యెగశ్వాస మాత్రమే వుంది.

ఏం చేయాలి

ఆ వ్యక్తిని ప్రతిస్పందింపజేయడంలో మీరు గనక ప్రయత్నించి విఫలమయినట్లయితే, ఆ వ్యక్తి గుండె స్తంభనతో బాధపడుతున్నట్లు గనక మీరు భావించినట్లయితే, ఏం చేయాలో ఇదిగో, ఇక్కడ వుంది:

  • సహాయం కోసం యెల్: సహాయం కోసం కేకలు పెట్టండి దగ్గరలోవున్న ఎవరికైనా 108 కి లేదా మీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్ కు కాల్ చేయమని చెప్పండి. ఆ వ్యక్తినిగానీ లేదా ప్రక్కనే వున్న మరెవరికైనా గానీ ఒక AED (ఆటోమేటెడ్ ఎక్స్ టర్నల్ డిఫిబ్రిలేటర్) ను తెచ్చి మీకిమ్మని కోరండి. ఈ పని అతి త్వరగా చేయమని చెప్పండి- ఎందుకంటే సమయం ఇక్కడ కీలకమైన విషయం.

    • ఇలాంటి గుండె స్తంభన లక్షణాలు ప్రదర్శిస్తున్న ఒక వయోజనుడి ప్రక్కన మీరొక్కరే గనక వున్నట్లయితే, 108 కి కాల్ చేయండి మరియు ఒక AED ని తీసుకోండి (లభ్యం అయినట్లయితే).

  • శ్వాస తనిఖీ : శ్వాస ఆడుతుందేమో పరీక్షించండి ఆ వ్యక్తికి శ్వాస ఆడకపోయినట్లయితే లేదా యెగశ్వాస మాత్రమే వున్నట్లయితే, CPR ఇవ్వండి.

  • సిపిఆర్ ఇవ్వండి గట్టిగా మరియు వేగంగా నొక్కండి: ఛాతీ మధ్యభాగంలో కనీసం 2 అంగుళాల మేరకు నిమిషానికి 100 నుండి 120 సార్లు చొప్పున క్రిందకు నొక్కండి, నొక్కిన ప్రతిసారీ ఛాతీ మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు అవకాశమివ్వండి.

  • AED ని ఉపయోగించండి : ఆటోమేటెడ్ ఎక్స్ టర్నల్ డిఫిబ్రిలేటర్ వచ్చిన వెంటనే దాన్ని ఉపయోగించండి. దానిని ఆన్ చేసిన తరువాత సూచించిన విధంగా చేయండి.

  • నొక్కుతూనే వుండండి:ఆ వ్యక్తికి శ్వాస ఆడేవరకూ లేదా కదిలేవరకూ, లేదా ఒక EMS టీమ్ మెంబర్ లాంటి మరింత అధునాతన శిక్షణ పొందిన మరొకరెవరైనా ఈ పనిని చేపట్టేవరకూ CPR ను ఇస్తూనే వుండండి.