Causes of Cardiac Arrest

దాదాపుగా, మనకు తెలిసిన అన్ని గుండె సమస్య పరిస్థితులూ గుండె స్తంభనకు కారణం కావచ్చు.

గుండె స్తంభననలలో అత్యధికభాగం వ్యాధిగ్రస్తమైన గుండె యొక్క విద్యుత్ వ్యవస్థ విఫలమయినప్పుడు సంభవిస్తాయి. ఈ వైఫల్యం కారణంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా లేదా వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ లాంటి గుండె కొట్టుకునే లయలో అసాధారణత సంభవిస్తుంది. గుండె కొట్టుకునే లయ తీవ్రంగా మందగించడం (బ్రాడీకార్డియా) కారణంగా కూడా కొన్ని గుండె స్తంభనలు సంభవిస్తాయి.

గుండె స్తంభనకు కారణమయ్యే ఇలాంటి క్రమరహిత హృదయ స్పందనలను తప్పనిసరిగా ప్రాణాంతక ఆరిథ్మియాలుగా పరిగణించవలసి వుంటుంది.

గుండె స్తంభనకు గల ఇతర కారణాలలో ఇవి కూడా వుంటాయి:

  • గుండె కణజాలంపై మచ్చలు పడడం:గతంలో వచ్చిన గుండె పోటు లేదా ఇతర కారణం ఫలితంగా ఇలాంటి మచ్చలు పడవచ్చు. మచ్చలు పడిన గుండె లేదా ఏదైనా కారణం వలన పెరిగిన గుండెలో ప్రాణాంతకమైన వెంట్రిక్యులార్ ఆరిథ్మియాలు అభివృద్ధి చెందే ప్రమాదం వుంది. అథెరోస్క్లెరోటిక్ గుండె జబ్బు వున్న రోగులలో గుండె పోటు వచ్చిన తరువాత మొదటి ఆరు నెలల కాలాన్ని ప్రత్యేకించి ఆకస్మిక గుండె స్తంభన వచ్చే ప్రమాదం అత్యధికంగా వున్న కాలవ్యవధిగా సూచించారు.

  • మందంగా మారిన గుండె కండరం (కార్డియోమయోపతి):అధిక రక్తపోటు, గుండె కవాటాల జబ్బు లేదా ఇతర కారణాల ఫలితంగా గుండె కండరం దెబ్బతినవచ్చు. వ్యాధిగ్రస్తమైన గుండె కండరం వలన ఆకస్మిక గుండె స్తంభన, ప్రత్యేకించి మీకు గుండె వైఫల్యం కూడా వున్నట్లయితే గనక, వచ్చే ప్రమాదం వుంది. కార్డియోమయోపతి గురించి మరింత తెలుసుకోండి.

  • గుండె సంబంధిత ఔషధాలు: కొన్ని పరిస్థితులలో, వివిధ గుండె సంబంధిత ఔషధాలు ఆకస్మిక గుండె స్తంభనకు కారణమయ్యే ఆరిథ్మియాలకు సానుకూల పరిస్థితిని కల్పిస్తాయి. (మీకు విచిత్రంగా అనిపించినప్పటికీ, ఆరిథ్మియాల చికిత్సకు ఉపయోగించే ఆరిథ్మియా వ్యతిరేక ఔషధాలను డాక్టరుగారిచే సూచించబడిన సాధారణ మోతాదులలో సేవించినప్పటికీ కొన్నిసార్లు వెంట్రిక్యులర్ ఆరిథ్మియాలను కలగజేస్తాయి. దీనినే “ప్రోఆరిథ్మిక్” ప్రభావం అంటారు.) రక్తంలో పొటాషియం మరియు మెగ్నీషియం యొక్క స్థాయులలో (ఉదాహరణకు, మూత్రవర్థకాలను వాడినప్పుడు) వచ్చే గణనీయమైన మార్పుల కారణంగా కూడా ప్రాణాంతకమైన ఆరిథ్మియాలు మరియు గుండె స్తంభనలు కలగవచ్చు.

  • విద్యుత్ వ్యవస్థలో అసాధారణతలు: వూల్ఫ్-పార్కిన్సన్-వైట్ సిండ్రోమ్ మరియు లాంగ్ క్యూటి సిండ్రోమ్ వంటి కొన్ని విద్యుత్ వ్యవస్థ అసాధారణతల కారణంగా పిల్లలు మరియు యువజనులలో ఆకస్మిక గుండె స్తంభన కలగవచ్చు.

  • రక్తనాళాలలో అసాధారణతలు : అరుదైన సందర్భాలలో, పుట్టుకతో వచ్చే రక్తనాళాల అసాధారణతలు, ప్రత్యేకించి గుండె ధమనులు మరియు బృహద్ధమనిలో, గుండె స్తంభన కలిగించవచ్చు. ఈ అసాధారణతలు ఉన్నట్లయితే, తీవ్రమైన శారీరక శ్రమ చేసేటప్పుడు విడుదలయ్యే అడ్రినలిన్ తరచుగా ఆకస్మిక గుండె స్తంభనలకు కారణమవుతుంది.

  • వినోద ఔషధ వినియోగం: మానసికోల్లాసాన్ని కలిగించే ఔషధాల వాడకం ఇతర విధాలుగా సంపూర్ణ ఆరోగ్యవంతులైన వ్యక్తులలో కూడా కొన్ని మానసికోల్లాస ఔషధాలను వాడకం వలన ఆకస్మిక గుండె స్తంభన కలగవచ్చు.